: కోర్టు ఆవరణలో కాల్పులు... ఒకరి మృతి
హర్యానాలోని హిస్సార్ లో ఉన్న కోర్టు ఆవరణ ఒక్కసారిగా తుపాకీ కాల్పుల మోతతో మారుమోగింది. ఓ యువకుడు హఠాత్తుగా జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే ఘటనలో మరో వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాల్పులకు పాల్పడిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల ఘటనతో కోర్టు ఆవరణలో ఉన్నవారంతా భయంతో పరుగులు తీశారు. కాల్పులు జరపడానికి గల కారణాలేమిటన్నది ఇంకా తెలియరాలేదు.