: 'అరౌండ్ ద వరల్డ్ ఇన్ 80 డేస్'...ఫ్రెంచ్ పైలట్ల సాహసం!


'అరౌండ్ ద వరల్డ్ ఇన్ 80 డేస్' అంటే జాకీ చాన్ నటించిన సినిమా పేరనుకుంటున్నారా? అచ్చం అలాంటిదే ఇది. జూల్స్ వెర్న్ రాసిన 'అరౌండ్ ద వరల్డ్ ఇన్ 80 డేస్' నవలను స్ఫూర్తిగా తీసుకున్న ఇద్దరు ఫ్రెంచ్ పైలట్లు ప్రపంచయాత్రకు సిద్ధమయ్యారు. 1873లో వచ్చిన ఆ నవల పాఠకులను ఆకట్టుకుంది. తరువాత జాకీచాన్ ప్రధాన పాత్రలో ఆ నవలను సినిమాగా రూపొందించారు. ఇది కూడా అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమాలోలాగా 80 రోజుల్లో ప్రపంచయాత్ర పూర్తి చేయాలని వీరు భావిస్తున్నారు. విన్సెంట్ మాయిసన్, ఫిలిప్పీ రెనౌడెట్ అనే ఫ్రెంచ్ పైలట్లు ప్రత్యేకంగా తయారు చేసిన ఓ విమానంలో 24 దేశాల మీదుగా 45 వేల కిలోమీటర్లు చుట్టేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భారత దేశంలో అహ్మదాబాద్, నాగపూర్, కోల్ కతా నగరాల్లో వీరు ఆగనున్నారు. ఈ యాత్ర మొత్తం 220 గంటల ప్రయాణంగా ఉండగా, 20 దేశాల్లో 40 సార్లు ఆగుతారు. వీరు శనివారం కోల్ కతా చేరుకోనున్నట్టు ఫ్రెంచ్ కాన్సులేట్ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News