: ముస్లిం యూనివర్శిటీ ఎన్నికల్లో దారుణం... అధ్యక్ష పదవికి పోటీ చేసిన మహిళ హత్య
ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థగా పేరుగాంచిన లక్నోలోని అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థి సంఘం ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న బలరాంపూర్ కు చెందిన అస్మా జావేద్ (28) దారుణ హత్యకు గురయ్యారు. రెండు రోజుల క్రితమే ఆమెను చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది కచ్చితంగా హత్యేనని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ చరిత్రలో ఇంత వరకు ఒక్క మహిళ కూడా పోటీ చేయలేదు. మొట్టమొదటిసారిగా ఈ యూనివర్శిటీలో పీహెచ్ డీ పూర్తి చేసిన ఆస్మా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆమె ప్రచారం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.