: రామోజీరావుకు అయ్యన్నపాత్రుడు సవాలు
'ఈనాడు' సంస్థల అధినేత రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సవాలు విసిరారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, పాడేరు ఏజెన్సీలో 45 కోట్ల రూపాయలు గోల్ మాల్ అయినట్టు వార్తలు ప్రసారం చేశారని, అవన్నీ అవాస్తవాలని అన్నారు. అధికారం చేపట్టిన ఈ 11 నెలల కాలంలో తమ శాఖకు చెందిన అన్ని ఫైళ్లు 'ఈనాడు' ఛైర్మన్ రామోజీరావు ముందుంచుతానని, అవినీతి జరిగిందని ఆయన నిరూపించగలరా? అని ఆయన సవాలు చేశారు. తప్పులు జరగకున్నా, జరిగాయంటూ వార్తలు ప్రసారం చేసి, తన ప్రతిష్ఠ దిగజారుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.