: ఇది మాకు 'డూ ఆర్ డై' మ్యాచ్: రికీ పాంటింగ్


నేడు కోల్ కతా నైట్ రైడర్స్ తో జరగబోయే మ్యాచ్ తమ జట్టుకు డూ ఆర్ డై లాంటిదని ముంబై ఇండియన్స్ జట్టు కోచ్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. నేటి మ్యాచ్ గురించి పాంటింగ్ మాట్లాడుతూ, ఈ సీజన్ లో నేటి మ్యాచ్ తమకు ఫైనల్ లాంటిందని అన్నాడు. డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతాపై విజయం సాధించేందుకు సన్నద్ధమవుతున్నామని ఆయన చెప్పాడు. చావో రేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్ లో వంద శాతం ప్రతిభను ప్రదర్శిస్తామని పాంటింగ్ స్పష్టం చేశాడు. కాగా, ఐపీఎల్ సీజన్-8లో చెన్నై ప్లే ఆఫ్ కు చేరుకోగా, కోల్ కతా మరో మ్యాచ్ లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్ చేరుకుంటుంది. తరువాతి స్థానాల కోసం సన్ రైజర్స్ హైదరాబాదు, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేటి సాయంత్రం జరుగనున్న పోరులో విజయం సాధించి ప్లే ఆఫ్ కు అర్హత సాధించాలని ముంబై, బెంగళూరు భావిస్తున్నాయి.

  • Loading...

More Telugu News