: ఢిల్లీలో గన్ కల్చర్...శివార్లలో తుపాకుల మోత
దేశరాజధాని అరాచకాలకు అడ్డాగా మారుతోంది. నిర్భయ లాంటి ఉదంతం జరిగిన అనంతరం భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన పోలీసులు, పెద్దగా పట్టించుకున్నట్టు కనబడడం లేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో గన్ కల్చర్ పెరిగిపోతోంది. దీంతో ఢిల్లీ శివార్లు తుపాకుల మోతతో మార్మోగుతున్నాయి. అక్కడి రాజేంద్రనగర్ లో రెండు వర్గాలు తుపాకులతో పరిసరాలను హడలెత్తించాయి. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను మరో వాహనంపై వచ్చిన దుండగులు కాల్చి చంపారు. వారిద్దరూ అక్కడికక్కడే మృత్యువాత పడగా, సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనాస్థలికి చేరుకుని, కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. కాగా, పాత కక్షల నేపథ్యంలో ఈ హత్యలు చోటుచేసుకున్నాయని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని వారు తెలిపారు. హతుల వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించడం విశేషం.