: మీడియాపై కోర్టుకెక్కిన కేజ్రీవాల్ కు 'సుప్రీం' మొట్టికాయలు
అధికారం హస్తగతం చేసుకునేవరకు మీడియాతో అంటకాగి, అధికారం చేతికందగానే మీడియాతో కయ్యానికి దిగిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. మీడియాపై పరువు నష్టం చర్యలు చేపట్టాలన్న కేజ్రీవాల్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. మీడియాపై 'ఆప్' తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మీడియాపై పరువు నష్టం దావా అంశాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. కాగా, ఢిల్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియా రాసే కథనాలపై పరువు నష్టం కేసులు రిజిస్టర్ చేయమని అన్ని శాఖల అధికారులను కేజ్రీవాల్ ఆదేశించిన విషయం తెలిసిందే. అలాగే, మీడియాకు అసెంబ్లీ ప్రవేశంపై నిషేధం విధించిన సంగతీ తెలిసిందే.