: కాబూల్ కాల్పుల మృతులకు మోదీ సంతాపం... మృతుల్లో ఒకరు ఏపీకి చెందిన డాక్టర్


ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 14 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో నలుగురు భారతీయులు కూడా ఉన్నారు. ఈ ఉగ్రదాడిపై చైనా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ స్పందించారు. ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండించిన ఆయన... ఉగ్రవాదులపై జరిపే పోరులో ఆఫ్ఘనిస్థాన్ కు సహకరిస్తామని తెలిపారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనితో మాట్లాడుతూ, మోదీ హామీ ఇచ్చారు. మృతి చెందిన భారతీయుల్లో ఒకరిని ఆంధ్రప్రదేశ్ కు చెందిన డాక్టర్ సతీష్ చంద్రగా గుర్తించారు.

  • Loading...

More Telugu News