: అప్పుడు ఎవరు చనిపోయినా తెలంగాణ కోసమే అన్నారు... ఇప్పుడు ఎవర్నీ పట్టించుకోవడం లేదు: పొన్నం
తెలంగాణ ఉద్యమం సమయంలో ఎవరు చనిపోయినా తెలంగాణ సాధన కోసమే అంటూ టీఆర్ఎస్ నేతలు రాద్ధాంతం చేసేవారని... ఇప్పుడు మాత్రం ఎవర్నీ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ప్రతి రోజూ రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా... దాని గురించి కనీసం మాట్లాడటం కూడా లేదని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి అధికార కాంక్ష తప్ప మరేమీ పట్టడం లేదని ఫైర్ అయ్యారు.