: పాలాభిషేకం కోసమే... 43 శాతం అడిగితే, 44 శాతమిచ్చారు: కేసీఆర్ పై పొన్నం ఫైర్


ఆర్టీసీ కార్మికుల సమ్మె, ప్రభుత్వం నిర్వహించిన చర్చలు, కార్మికుల డిమాండ్లు, సర్కారు పరిష్కారంపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ఫైరయ్యారు. కార్మికులు 43 శాతం ఫిట్ మెంట్ కోరితే, కేసీఆర్ 44 శాతం ఫిట్ మెంటిచ్చారన్న ఆయన, సమ్మె పాపమెవరిదని ప్రశ్నించారు. కార్మికుల చేత పాలాభిషేకం చేయించుకునేందుకే కేసీఆర్ కార్మికులు అడిగిన దానికంటే అధికంగా ఫిట్ మెంట్ ఇచ్చారని ఆరోపించారు. 44 శాతం ఫిట్ మెంట్ ఇచ్చే ఆర్థిక స్తోమత రాష్ట్రానికి ఉంటే, అసలు కార్మికులతో సమ్మె ఎందుకు చేయించినట్లు? అని ఆయన సర్కారును నిలదీశారు. గొప్పలు చెప్పించుకోవడానికి కేసీఆర్ కార్మికుల చేత సమ్మె చేయించి సామాన్య జనాన్ని నానా ఇబ్బందులు పెట్టారని పొన్నం విరుచుకుపడ్డారు.

  • Loading...

More Telugu News