: జైలుకి వెళ్లేందుకైనా సిద్ధం: తొగాడియా
హిందూత్వ పరిరక్షణ కోసం జైలు కెళ్లేందుకైనా సిద్ధమని విశ్వహిందూ పరిషత్ అధినేత ప్రవీణ్ తొగాడియా అన్నారు. హిందూ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్ పై ఆయన ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ జిల్లాలో విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
వీటిపై స్పందించిన మహరాష్ట్ర ప్రభుత్వం తొగాడియాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. మరోవైపు తొగాడియాను అరెస్టు చేస్తే దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతాయని మహరాష్ట్ర విశ్వహిందూ పరిషత్ నేత వెంకటేశ్ అబ్ దేవ్ హెచ్చరించారు.