: హిందీ 'విశ్వరూపం' నేడు విడుదల


వివాదాస్పద 'విశ్వరూపం' చిత్రం హిందీ వెర్షన్ నేడు దేశమంతటా విడుదల అవుతోంది. ఇందుకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలలో కమలహాసన్ పాల్గొంటున్నాడు. అందులో భాగంగా ముంబయ్ లో పత్రికా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నాడు. బాలీవుడ్ నటులు కూడా ఈ సినిమా విషయంలో కమల్ కు సంఘీభావం ప్రకటిస్తున్నారు.

ఇదిలా ఉంచితే, కమల్- ముస్లిం సంఘాలు కలిసి ఓ నిర్ణయంతో వస్తే కనుక, సమస్య పరిష్కారానికి సహకరిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కమల్ ముస్లిం సంఘాలతో భేటీ కానున్నారు. తమిళనాట ఈ చిత్రాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే!

  • Loading...

More Telugu News