: మహిళలతో మర్యాదగా లేకుంటే... పోలీసులకు పదోన్నతులు రావట!
చెల్లించిన రుసుముకు రసీదు అడిగిన మహిళపై ఇటుకలతో దాడి చేసిన ఢిల్లీ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉదంతం యావత్తు పోలీసు విభాగానికే కళంకం తెచ్చింది. దాంతో పాటే హెచ్చరికలను కూడా ఆ ఘటన జారీ చేసిందనే చెప్పాలి. దేశం మొత్తాన్ని విస్మయానికి గురి చేసిన మొన్నటి ఘటనపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఇకపై మహిళల పట్ల ప్రవర్తించే తీరుపైనే పోలీసుల పదోన్నతులు, పోస్టింగ్ లు ఉండాలని కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలకు సూచనలు చేసింది. మహిళలపై పోలీసులు ప్రవర్తించే తీరుపైనే సంబంధిత అధికారుల సర్వీస్ రికార్డులు నమోదు చేయాలని కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి కుమార్ అలోక్ అన్ని రాష్ట్రాలకు నిన్న స్పష్టమైన ఆదేశాలతో లేఖలు రాశారు.