: రాహుల్ రాక నేడే... రేపు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటన


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు తెలంగాణకు రానున్నారు. నేటి సాయంత్రం హైదరాబాదులోని శంషాబాదు ఎయిర్ పోర్టుకు చేరుకునే రాహుల్ గాంధీ శంషాబాదు, పంజాగుట్ట, బోయిన్ పల్లి, మేడ్చల్ మీదుగా నిర్మల్ చేరుకుంటారు. నిర్మల్ లోని మయూరా ఇన్ లో బస చేయనున్న రాహుల్, రేపు ఉదయం ఆదిలాబాదు జిల్లాలోని ఐదు గ్రామాల్లో రైతు భరోసా యాత్రను చేపట్టనున్నారు. ఈ గ్రామాల్లో ఇటీవల ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శిస్తారు. అనంతరం ఆయన హైదరాబాదు మీదుగా ఢిల్లీ బయలుదేరి వెళతారు.

  • Loading...

More Telugu News