: అన్నా డీఎంకే పార్టీకి అప్పీళ్ల భయం!


మాజీ ముఖ్యమంత్రి జయలలితను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడం తెలిసిందే. దీంతో, జయ మళ్లీ తమిళనాడు ముఖ్యమంత్రి పగ్గాలు అందుకోవడం లాంఛనమేనంటూ మీడియాలో విశేషంగా వార్తలు వచ్చాయి. వారం లోపు ఆమె సీఎం పీఠం అధిష్ఠిస్తుందని సొంత పార్టీ అన్నా డీఎంకే వర్గాలు పేర్కొన్నాయి కూడా. అయితే, కర్ణాటక హైకోర్టు తీర్పు రుచించని కర్ణాటక సర్కారు, తమిళనాడులోని పార్టీలు అప్పీళ్లకు సిద్ధపడుతుండడంతో జయలలిత ఇప్పట్లో ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు కనిపించడంలేదు. పీఎంకే అధ్యక్షుడు జీకే మణి అప్పీల్ విషయమై కర్ణాటక సీఎంను కలిసి చర్చించారు. హైకోర్టు తీర్పుపై స్టే కోరుతూ అప్పీల్ చేయాలంటూ సిద్ధరామయ్యను ప్రోత్సహించారు. అటు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ కర్ణాటక సర్కారు అప్పీలు చేయకపోతే తాము అప్పీలు చేస్తామంటూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ అన్నా డీఎంకే వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ వ్యవహారాలన్నీ ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే 'అమ్మ' ప్రమాణస్వీకారం చేస్తే బాగుంటుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News