: కాంగ్రెస్ కు లభిస్తున్న ప్రజాదరణ చూసి టీఆర్ఎస్, బీజేపీ ఉలిక్కిపడుతున్నాయి: ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహల్ గాంధీ పర్యటనపై వస్తున్న విమర్శల పట్ల స్పందించారు. ప్రభుత్వాల బాధ్యతను గుర్తు చేసేందుకే రాహుల్ పాదయాత్ర చేస్తున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు లభిస్తున్న ప్రజాదరణతో టీఆర్ఎస్, బీజేపీ ఉలిక్కి పడుతున్నాయని ఎద్దేవా చేశారు. రాహుల్ పాదయాత్రపై విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. రాహుల్ యాత్రపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పాలనలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అందుకే, రాహుల్ ముక్కు నేలకేసి రాసి తెలంగాణలో అడుగుపెట్టాలని వ్యాఖ్యానించారు.