: నిజాయతీకి నిర్వచనం చెప్పిన పోలీస్ అధికారి


పోలీస్ శాఖపై సినిమాల్లోనూ, నిజ జీవితంలోనూ ఎన్నో ఆరోపణలు, మరెన్నో విమర్శలు. ఈ నేపథ్యంలో ఓ పోలీస్ అధికారి నిఖార్సైన పోలీస్ ఎలా ఉండాలో సమాజానికి నిర్వచించి చెప్పారు. మధ్యప్రదేశ్ లోని దిండోరికి చెందిన మనోజ్ త్రిపాఠి అనే పోలీస్ అధికారి గర్సారాయ్ పోలీస్ స్టేషన్ కి ఇన్ఛార్జీగా పనిచేస్తున్నారు. ఆయన స్వంత వాహనంలో సగుర్తలా వైపు వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టారు. దీంతో ఆ ద్విచక్రవాహనంపై ఉన్న పూల్ చంద్ర (40), రాంలాల్ (25), బబ్లూ (19)లకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన మనోజ్ త్రిపాఠి, గర్సారాయ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనపై తానే కేసు నమోదు చేసుకున్నారు. సాధారణంగా త్రిబుల్ రైడింగ్ అంటేనే వారిని బెదిరిస్తారు పోలీసులు, అదీ కాక ఉన్న కేసుల నుంచి ఎలాంటి జిత్తులతో విముక్తి పొందుదామా అని అంతా ప్రయత్నిస్తుంటే, తనపై తానే కేసు నమోదు చేసుకుని మనోజ్ త్రిపాఠి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని అంతా అభినందిస్తున్నారు.

  • Loading...

More Telugu News