: రిటైర్డ్ ఉద్యోగులకు 3 వేల ఫించన్ ఇవ్వాలన్నా కష్టమే:పార్లమెంటులో దత్తాత్రేయ
రిటైర్డ్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కనీస పింఛనుగా 3 వేల రూపాయలు చెల్లించాలన్నా కష్టమేనని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పార్లమెంటుకు తెలిపారు. రాజ్యసభలో ఓ ప్రశ్నకు లిఖితరూప సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి బండారు 1995 ఉద్యోగ పింఛను పధకం కింద కనీస పింఛనుగా 3 వేల రూపాయలు చెల్లించడం సాధ్యం కాదని అన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాలంటే ఆర్థిక శాఖపై పెను భారం పడుతుందని ఆయన పేర్కొన్నారు. దీంతో వారందరికీ కనీస పింఛన్ చెల్లించడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. కాగా, విశ్రాంత ఉద్యోగులకు కనీస పింఛనుగా 3 వేల రూపాయలు చెల్లించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.