: ఎన్నో చెరువులు తవ్వించాడు కాబట్టే ఆయనను ఇప్పటికీ గుర్తుంచుకున్నాం: చంద్రబాబు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లాలో నీరు-చెట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... శ్రీకృష్ణ దేవరాయలను కీర్తించారు. ఆయన మహానుభావుడని, ఎన్నో చెరువులు తవ్వించి, ప్రజలకు మేలు చేశాడని కొనియాడారు. అందుకే ఆయనను ఇప్పటికీ గుర్తుంచుకున్నామని తెలిపారు. నదుల అనుసంధానంతో కరవును పారదోలుదామని అన్నారు. వర్షభావ పరిస్థితుల నేపథ్యంలో, రాష్ట్రంలో భూగర్భ జలమట్టం పడిపోయిందని, అందుకే జల సంరక్షణ చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వర్షం నీటిని భూగర్భ జలాలుగా మార్చుకునే విధానాలను అనుసరించాలని ఆయన రైతులకు సలహా ఇచ్చారు. ఇక, యువశక్తి గురించి మాట్లాడుతూ... రాష్ట్రంలో పిల్లలు మట్టిలో మాణిక్యాలని, రాష్ట్ర యువతకు ప్రపంచాన్ని జయించే శక్తి ఉందని పునరుద్ఘాటించారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తేనని గుర్తు చేశారు. పట్టుదలతో శ్రమిస్తే ఏదీ అసాధ్యం కాదంటూ యువతలో ఉత్సాహం పెంపొందించేందుకు ప్రయత్నించారు.

  • Loading...

More Telugu News