: తాజ్ మహల్ రంగు మారడానికి కారణం కాలుష్యం కాదు: కేంద్ర మంత్రి


కాలుష్యం కారణంగా ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్ మహల్ పసుపు రంగులోకి మారడం లేదని కేంద్ర మంత్రి మహేష్ శర్మ అన్నారు. పార్లమెంట్ లో ప్రతిపక్షాలు వేసిన ప్రశ్నకు సమాధానమిస్తూ, తాజ్ రంగు మారడానికి కారణం కాలుష్యం కాదని స్పష్టం చేశారు. రంగు మారేందుకు కారణాలు శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారన్న కేంద్ర మంత్రి, తాజ్ మహల్ ను సంరక్షించేందుకు చర్య చేపట్టామని అన్నారు. తాజ్ మహల్ పరిసర ప్రాంతాల్లో కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని ఆయన స్థానిక అధికారులను ఆదేశించారు. కాగా, తాజ్ సౌందర్యాన్ని పరిరక్షించేందుకు మడ్ థెరపీ చేయనున్నారని రెండు రోజుల క్రితం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News