: గాంధీలు వస్తుంటారు, పోతుంటారు...వాళ్ల గురించి ఏం మాట్లాడతాం? : కేసీఆర్
తెలంగాణ రాష్ట్రానికి చాలా మంది గాంధీలు వస్తుంటారు, పోతుంటారు...అలాంటి వారి గురించి ఏం మాట్లాడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం గురించి మాట్లాడిన సందర్భంగా రేపటి రాహుల్ గాంధీ పర్యటన గురించి స్పందించాలని మీడియా కేసీఆర్ ను కోరగా, ఆయన పై విధంగా స్పందించారు. రాహుల్ పర్యటన ప్రభావం తెలంగాణలో ఏమీ ఉండదని ఆయన పేర్కొన్నారు.