: ఇకపై చికున్ గున్యా వ్యాధిని గంటలో నిర్ధారించుకోవచ్చు
దోమల ద్వారా వ్యాపించే చికున్ గున్యా వ్యాధిని ఇకపై కేవలం గంట వ్యవధిలోనే నిర్ధారించుకోవచ్చు. రోజుల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. అమెరికాలోని ఆర్మీ మెడికల్ పరిశోధనా సంస్థ ఈ పరికరాన్ని తయారు చేయడమేకాక, విజయవంతంగా పరీక్షించింది. గర్భ నిర్ధారణ చేసే ప్రక్రియ లాగే ఈ పరీక్షను కూడా చేస్తారు. ఈ పరికరం అందుబాటులోకి వస్తే... చికున్ గున్యా వ్యాధికి ఆదిలోనే అడ్డుకట్ట వేయవచ్చని శాస్త్రజ్ఞులు తెలిపారు.