: ఆనందంలో గుండె ఆగి మరణించిన ఆర్టీసీ కార్మికుడు


ఆర్టీసీ కార్మికుల సమ్మె ముగిసింది. కార్మికులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించిందన్న విషయం తెలియగానే... పట్టరాని ఆనందంతో ఓ కార్మికుడు గుండె ఆగి మరణించాడు. ఈ విషాద ఘటన కడప జిల్లా పులివెందులలో జరిగింది. ప్రభుత్వంతో చర్చలు సఫలమయ్యాయని, పాత బకాయిలను రిటైర్మెంట్ సమయంలో ఇస్తారని, గత మూడు నెలల బకాయిలను రెండు విడతల్లో ఇస్తారన్న విషయం తెలియగానే కార్మికుడు నారాయణ ఆనందం పట్టలేక పోయాడు. గుండె ఆగి మరణించాడు.

  • Loading...

More Telugu News