: చార్జీలు పెంచే ఆలోచన లేదు: ఆర్టీసీ ఎండీ
ఏపీ ఆర్టీసీ కార్మికులకు ఫిట్ మెంట్ ఇచ్చిన నేపథ్యంలో చార్జీలు పెంచే ఆలోచనే లేదని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు స్పష్టం చేశారు. ఎనిమిది రోజుల పాటు సమ్మె వల్ల ప్రజలకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణ చెబుతున్నామన్నారు. ఇక ఆర్టీసీకి నిధులు సమకూర్చుకోవడానికి మార్గాలు వెదుకుతున్నామన్నారు. 43 శాతం ఫిట్ మెంట్ వల్ల సంస్థపై రూ.960 కోట్ల భారం పడుతుందన్న ఎండీ, ఇప్పటికే ఆర్టీసీ రూ.3100 కోట్ల అప్పుల్లో ఉందని వెల్లడించారు.