: యూకేలో తొలి ఆసియా మహిళా మేయర్ గా భారతీయ సంతతి వనిత


భారత సంతతికి చెందిన 62 ఏళ్ల హర్భజన్ కౌర్ ధీర్ యూకేలో మేయర్ గా ఎన్నికయ్యారు. ఆసియా నుంచి యూకేలో మేయర్ గా ఎన్నికైన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. తాజగా జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీకి చెందిన హర్భజన్ కౌర్ ధీర్ లండన్ లోని ఎయిలింగ్ కౌన్సిల్ మేయర్ గా ఎన్నికయ్యారు. ఈమేరకు ఆమె విక్టోరియా హాల్ లో ప్రమాణస్వీకారం చేశారు. మేయర్ గా ఎన్నికవ్వడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. 1953లో భారత్ లోని పంజాబ్ లో జన్మించిన హర్భజన్ కౌర్ 1975లో యూకే వెళ్లారు. గతంలో ఆమె భర్త రంజిత్ ధీర్ కూడా ఎయిలింగ్ కౌన్సిల్ మేయర్ గా పని చేశారు.

  • Loading...

More Telugu News