: హైదరాబాద్ లో మెట్రో పిల్లర్ ను ఢీకొన్న వాహనం... నలుగురికి తీవ్ర గాయాలు
హైదరాబాదులోని కూకట్ పల్లి, వివేకానందనగర్ కాలనీ దగ్గర ఓ వాహనం మెట్రో పిల్లర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స జరుగుతోంది. అయితే వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.