: ఉన్నత విద్యా మండలి పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ... ఏపీ విద్యా మండలి కొనసాగింపుకు పచ్చజెండా
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఏపీ తరపున సీనియర్ న్యాయవాదులు పీపీ రావు, బసవ పాటిల్ వాదనలు వినిపించగా; తెలంగాణ తరపున కాంగ్రెస్ నేతలు, సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ మనులు వాదించారు. విభజన చట్టాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఉన్నత విద్యా మండలిపై హైకోర్టు తీర్పు ఇచ్చిందని పీపీ రావు వాదించారు. దాని ప్రభావం ఇతర సంస్థలపై పడుతుందని తెలిపారు. ఈ క్రమంలో హైకోర్టు విచారణలో మీరెందుకు భాగస్వామ్యం కాలేదని ఎపీని సుప్రీం ప్రశ్నించింది. ఆంధ్రాలో ప్రవేశ పరీక్షలు మీరే నిర్వహించుకోండని చెప్పింది. ఈ నేపథ్యంలో ఏపీ ఉన్నత విద్యా మండలి ఉనికిలో లేదన్న హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ లో కేంద్ర ప్రభుత్వం భాగస్వామి కావాలని ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం నాలుగు వారాలపాటు వాయిదావేసింది.