: వరుడ్ని చితక్కొట్టి నగలు ఎత్తుకుపోయేందుకు ప్రయత్నించిన ఆగంతుకుడు
తిరుమలలో దారుణం చోటుచేసుకుంది. నవదంపతులపై ఓ ఆగంతుకుడు దాడి చేశాడు. తిరుమలలోని కల్యాణ వేదిక వద్ద వరుడుని చితక్కొట్టిన ఓ దుండగుడు వధువు దగ్గరున్న బంగారు ఆభరణాలు ఎత్తుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతని ప్రయత్నాన్ని పసిగట్టిన పెళ్లి బృందం స్థానికుల సాయంతో అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.