: ఏపీలో కలపకపోతే ప్రమాణస్వీకారం చేయబోనని ప్రధానికి చెప్పా: చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మళ్లిస్తేనే రాయలసీమకు నీటి కొరత తీరుతుందని తెలిపారు. అలాగని, గోదావరి జిల్లాలకు అన్యాయం చేయబోమని, కేవలం సముద్రంలో కలిసే జలాలను మళ్లిస్తామని వివరించారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపకుంటే ప్రమాణస్వీకారం చేయబోనని ప్రధానమంత్రికి తెగేసి చెప్పానని చంద్రబాబు చెప్పారు. కాగా, జిల్లాలోని గోరుకల్లు రిజర్వాయర్ పనులను ఆయన పరిశీలించారు. రైతులతో పలు అంశాలపై మాట్లాడారు.