: యూటర్న్ తీసుకున్న యువతి ఆత్మహత్యాయత్నం కేసు... అమ్మాయిపై తీవ్ర విమర్శలు చేసిన వరుడి తండ్రి
నిశ్చితార్థం చేసుకున్న తరువాత వరుడు నవదీప్ రాజు ముఖం చాటేయడంతో, ఆత్మహత్యాయత్నం చేసిన యువతి కథ మరో మలుపు తిరిగింది. తమపై వచ్చిన ఆరోపణలను నవదీప్ తల్లిదండ్రులు ఖండించారు. వధువు తరపు వారు చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని, వారిని ఎటువంటి డబ్బులు డిమాండ్ చేయలేదని తెలిపారు. అమ్మాయి బీటెక్ చదివిందని అబద్ధం చెప్పారని, తన కుటుంబానికి నెలనెలా డబ్బు పంపాలని అమ్మాయి డిమాండ్ చేసిందని ఆరోపిస్తూ, అందువల్లే వివాహాన్ని మూడు నెలలు వాయిదా వేసుకున్నామని చెప్పారు. ఇదిలావుండగా, నిశ్చితార్థ సమయంలో కట్నకానుకలు వద్దని చెప్పిన వరుడి తండ్రి పరోక్షంగా రూ.50 లక్షల కట్నాన్ని డిమాండ్ చేశారని, ఆపై పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వెళ్లడంతోనే, తన కుమార్తె మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసుకుందని వధువు తండ్రి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటన ఈ రోజు హైదరాబాదులో చోటుచేసుకున్న సంగతి విదితమే!