: రాహుల్ ది 'కాంగ్రెస్ భరోసా' యాత్ర: ఎంపీ బాల్క సుమన్
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. ఆయనది రైతు భరోసా యాత్ర కాదని, కాంగ్రెస్ భరోసా యాత్ర అని విమర్శించారు. వడగండ్ల వాన పడితే అమేథిలో పర్యటించకుండా రాహుల్ తెలంగాణలో పర్యటిస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. ఇదే సమయంలో టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేష్ అమెరికా పర్యటనపై విమర్శలు చేశారు. ఏ అధికార హోదాతో ప్రత్యేక విమానాల్లో అమెరికాలో తిరుగుతున్నారని సుమన్ ప్రశ్నించారు. కానీ అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అక్కడి పెద్ద సంస్థలను తెలంగాణకు తెస్తున్నారన్నారు.