: బీజేపీ ఎమ్మెల్యేలది చిల్లర రాజకీయం: మంత్రి తలసాని


'స్వచ్ఛ హైదరాబాద్'పై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు చేస్తున్న విమర్శలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తిప్పికొట్టారు. ఈ కార్యక్రమంపై బీజేపీ ఎమ్మెల్యేలు చిల్లర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోసం అసలు వారు కలవనేలేదన్న తలసాని, కావాలనే సచివాలయంలో ఆందోళన చేశారన్నారు. అస్థిత్వం కోల్పోతామన్న భయంతోనే బీజేపీ లొల్లి చేస్తుందని వ్యాఖ్యానించారు. స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో ప్రతీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే ప్రాతినిధ్యం వహిస్తారని మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News