: రూ. 10 లక్షలకు మించి నగదు దగ్గరుంటే చట్ట వ్యతిరేకమే!


నల్లధనాన్ని అరికట్టే దిశగా తీసుకోవాల్సిన చర్యల గురించి సిఫార్సులు చేసేందుకు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) తన నివేదికను కేంద్రానికి అందించింది. రూ. 10 లక్షలకు మించి నగదు దగ్గర పెట్టుకుంటే దాన్ని చట్ట వ్యతిరేకంగా ప్రకటించాలని ఈ నివేదికలో సిట్ సిఫార్సు చేసింది. రూ. 10 లక్షలకు మించి నగదు ఉన్న వారిని విచారించే హక్కు ఉండాలని కోరింది. ఈ మేరకు సుప్రీంకోర్టుతో పాటు ఆర్థిక వ్యవహారాల విభాగానికి నివేదికను సమర్పించిన సిట్, వాటి నుంచి వచ్చే స్పందన కోసం ఎదురుచూస్తోంది. యమునా ఎక్స్ ప్రెస్ వే, గ్రేటర్ నోయిడాలో పనిచేసిన ఇంజనీరు యాదవ్ సింగ్ పై యూపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని గుర్తు చేసిన సిట్, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని రికమండ్ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెబీ, సీబీఐ తదితర సంఘాల్లోని అధికారులు తాము విదేశాల్లో నగదు దాచుకోలేదన్న అఫిడవిట్లు దాఖలు చేయాలని సూచించింది. హెచ్ఎస్ బీసీకి చెందిన 628 విదేశీ ఖాతాల్లో రూ. 6,400 కోట్ల ధనం ఉందని గుర్తు చేసిన నివేదిక, 298 కేసుల్లో ఎంత డబ్బు ఉందో బయటకు ఇంకా వెల్లడి కాలేదని తెలిపింది.

  • Loading...

More Telugu News