: భారత్-పాక్ సిరీస్ పై జోరందుకున్న చర్చలు... వేదికపై తర్జనభర్జన


ముంబై దాడులతో స్తంభించిన భారత్-పాక్ క్రికెట్ సిరీస్ పై ప్రస్తుతం చర్చలు జోరందుకున్నాయి. ఇటీవల కోల్ కతా వచ్చిన పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్, బీసీసీఐ చీఫ్ జగ్ మోహన్ దాల్మియాతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న పాక్ తో క్రికెట్ మ్యాచ్ లేంటని బీజేపీ ఎంపీ ఒకరు అసహనం వ్యక్తం చేశారు. అయినా పాక్ తో సిరీస్ పట్ల ముందుకు సాగేందుకే బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య జరిగే సిరీస్ కు వేదిక ఇండియా అయితే బాగుంటుందని దాల్మియా, ఖాన్ తో అన్నారట. ఈ ప్రతిపాదన పట్ల కాస్త తటపటాయించిన షమర్యార్ షార్జాలో అయితే బాగుంటుందన్నారట. ఈ చర్చలను బట్టి చూస్తే ఇరు దేశాల మధ్య మ్యాచ్ లకు దాదాపుగా ప్రభుత్వాలు పచ్చజెండా ఊపినట్లే కనిపిస్తోంది. త్వరలోనే వేదిక కూడా ఖరారు కానుందన్న వార్తలు వెలువడుతున్నాయి.

  • Loading...

More Telugu News