: హీరోయిన్లపై దాసరి సంచలన వ్యాఖ్యలు


సూటిగా మాట్లాడటంలో, ఉన్నదున్నట్టు చెప్పడంలో దర్శకరత్న దాసరి నారాయణరావు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. అయితే, ఈమధ్య కాలంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఈ క్రమంలో, తాజాగా ఆయన నేటితరం హీరోయిన్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో సరైన కథానాయిక ఒక్కరు కూడా లేరంటూ ఒక్క ముక్కలో తేల్చిపారేశారు. అంతేకాదు, ప్రస్తుతమున్న హీరోయిన్లు అందరూ నటీమణులు కాదని, కేవలం ఐటెం భామలే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఐటెం సాంగ్స్ చేయడానికి సిల్క్ స్మిత, డిస్కో శాంతిలాంటి వారు ప్రత్యేకంగా ఉండేవారని... ప్రస్తుతం టాప్ పొజిషన్ లో ఉన్న హీరోయిన్లు కూడా ఐటెం సాంగుల వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. ప్రస్తుతం ఏ హీరోయిన్ కూడా ఐదేళ్లకు మించి ఇండస్ట్రీలో నిలువలేకపోతోందని చెప్పారు.

  • Loading...

More Telugu News