: నేపాల్ లో ఈరోజు కూడా భూప్రకంపనలు
నేపాల్ లో ఈ రోజు కూడా భూప్రకంపలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ఖాట్మండుకు 80 కిలో మీటర్ల దూరంలో రెండు సార్లు భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.8, 4.4గా నమోదైంది. నేపాల్ లోని కొడారి వద్ద భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కాగా, నిన్న నేపాల్ లో రెండు సార్లు భూ ప్రకంపనలు వచ్చాయి. ఇప్పటివరకు 68 మంది చనిపోగా, 1100 మందికి గాయాలయ్యాయి.