: 11 నెలల వయసులో వివాహం... కాపురానికి వెళ్లనందుకు 16 లక్షల జరిమానా... కోర్టుకెక్కిన రాజస్థాన్ యువతి


ఆమె పేరు శాంతాదేవి. వయసు ప్రస్తుతం 19 సంవత్సరాలు. టీచరుగా పనిచేయాలన్నది ఆమె లక్ష్యం. ఆమె లక్ష్యానికి పెను విఘాతం తగిలింది. కాపురానికి రమ్మని ముక్కూ మొహం తెలియని వ్యక్తి కోరాడు. అసలు విషయం తెలుసుకొని నిర్ఘాంతపోయింది. 11 నెలల వయసుండగా సన్వల్ రామ్ అనే వ్యక్తితో వివాహం జరిపించినట్టు తల్లిదండ్రులు చెప్పారు. తనకు తెలియకుండా జరిగిన పెళ్లి పెళ్లే కాదని, కాపురానికి వెళ్లేది లేదని తెగేసి చెప్పింది. గొడవ పంచాయితీకి వెళ్లడంతో శాంతాదేవి కుటుంబం రూ. 16 లక్షలు జరిమానా చెల్లించాలని తీర్పిచ్చారు పెద్దలు. అంత కట్టే స్తోమత లేదంటూ మొత్తుకున్నా వినిపించుకోలేదు. ఆ వివాహాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అక్కడి మహిళా సంఘాలు శాంతాదేవి నిర్ణయాన్ని హర్షిస్తూ, ఆమెకు వెన్నుదన్నుగా నిలిచేందుకు నిర్ణయించాయి. పంచాయితీ జరిమానా విషయమై ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తడంతో దీనిపైనా విచారణకు రాజస్థాన్ ప్రభుత్వం ఆదేశించింది.

  • Loading...

More Telugu News