: విద్యార్థులు ఒక సెంటర్ కు బదులు మరో సెంటర్ కు వెళ్లినా ఎంసెట్ రాయవచ్చు: కన్వీనర్ రమణారావు
తెలంగాణ వ్యాప్తంగా రేపు ఎంసెట్ ప్రవేశ పరీక్ష జరగనున్న నేపథ్యంలో పరీక్ష నిర్వహణపై సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. కన్వీనర్ రమణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, జేఎన్ టీయూ ఉన్నతాధికారులు, ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఎంసెట్ పరీక్షకు నిబంధనలు యథావిధిగా వర్తిస్తాయని కన్వీనర్ రమణారావు తెలిపారు. నిమిషం ఆలస్యమైనా ఎంసెట్ పరీక్షకు విద్యార్థులను అనుమతించమని మీడియాతో స్పష్టం చేశారు. సమ్మె నేపథ్యంలో బస్సుల కోసం ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకునేలా విద్యార్థులు బయలుదేరాలని సూచించారు. ఓ సెంటర్ కు వెళ్లాల్సిన విద్యార్థులు మరో సెంటర్ కు వెళ్లినా ఎంసెట్ పరీక్ష రాసేందుకు అనుమతిస్తామని ఆయన వెల్లడించారు.