: జయ సీఎం అయినా... మళ్లీ రాజీనామా చేయక తప్పదు: సుబ్రహ్మణ్యస్వామి
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా తేల్చినప్పటికీ... ఆమె బద్ధ శత్రువు, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి మాత్రం ఆమెను ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేరు. కేవలం లెక్కల్లో తప్పుల వల్లే జయ నిర్దోషిగా బయటపడ్డారని స్వామి అన్నారు. ఇదొక అంకెల తప్పుల విషాదమని అభివర్ణించారు. హైకోర్టు తీర్పుపై తాను సుప్రీంకోర్టుకు అప్పీల్ కు వెళుతున్నానని తెలిపారు. ఒకవేళ జయ సీఎం పదవిని చేపట్టినా... మళ్లీ రాజీనామా చేయక తప్పదని చెప్పారు. దివంగత ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చిన ఓ జీవో... జయ నిర్దోషిగా బయటపడటానికి ఉపయోగపడింది. ఆదాయానికన్నా 20 శాతం వరకు అధికంగా ఆస్తులున్నా అనుమతించవచ్చన్న ఈ జీవోను జయ తరపు లాయర్లు తమకు అనుకూలంగా మలచుకున్నారు.