: కేసీఆర్ వివక్షాపూరిత పాలనకు చెక్ పెట్టండి... గవర్నర్ కు బీజేపీ ఎమ్మెల్యేల వినతి
తెలంగాణలో సీఎం కేసీఆర్ వివక్షతో కూడిన పాలనను సాగిస్తున్నారని బీజేపీ శాసనసభాపక్షం ఆరోపించింది. నిన్న సీఎం కార్యాలయం ముందు బైఠాయించిన బీజేపీ ఎమ్మెల్యేలు నేడు ఏకంగా రాజ్ భవన్ గడప తొక్కారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ అయ్యారు. పాలనలో వివక్షతో కూడిన నిర్ణయాలు తీసుకుంటున్న కేసీఆర్ ను కట్టడి చేయాలని ఈ సందర్భంగా గవర్నర్ కు బీజేపీ బృందం ఫిర్యాదు చేసింది.