: సర్కారీ ప్రకటనల్లో రాజకీయ నేతల ఫొటోలుండొద్దు: సుప్రీంకోర్టు ఆదేశాలు


కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ప్రకటనల్లో రాజకీయ నేతల ఫొటోలు ఇకపై కనిపించవు. కేవలం రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫొటోలు మినహా ఏ ఒక్కరి ఫొటోలు కనిపించవు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం అధికారికంగా జారీ చేస్తున్న ప్రకటనల్లో ఆయా శాఖ మంత్రులు, సహాయ మంత్రుల ఫొటోలు పెద్ద సంఖ్యలో దర్శనమిస్తున్న వైనంపై దాఖలైన పిల్ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News