: సమ్మె నేపథ్యంలో ఇరు ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి: హైకోర్టు ఆదేశం
ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించని నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. దానికి సంబంధించి నివేదికలు సమర్పించాలని కూడా చెప్పింది. బస్సులను పోలీసుల బందోబస్తు మధ్య నడపాలని ప్రభుత్వాలకు సూచించింది. అదేవిధంగా బస్సులపై ఆర్టీసీ కార్మికులు దాడులకు పాల్పడినట్టు రుజువైతే గనుక కేసులు నమోదుచేసి కఠినంగా శిక్షించాలని కోర్టు ఆదేశించింది. ప్రత్యేకంగా ఏపీ సర్కారు జారీ చేసిన జీవో 14 ఎస్మా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలంది. మరోవైపు, ఎస్మా చట్టం తెలంగాణ కార్మికులకు వర్తించదని యూనియన్ల తరపున న్యాయవాదులు వాదించడంతో చర్యలు ఉండబోవని స్పష్టమైంది.