: జపాన్ ను వణికించిన భూకంపం
నేపాల్ ను అతలాకుతలం చేసి, ఇండియాలోని పలు ప్రాంతాలను వణికించిన భూకంపం ఈ తెల్లవారుజామున జపాన్ పై పంజా విసిరింది. జపాన్ ఈశాన్య ప్రాంతంలోని తీర ప్రాంతాల్లో ఇది సంభవించింది. అయితే అధికారులు ఎలాంటి సునామీ హెచ్చరికలను ఇంతవరకు జారీ చేయలేదు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదయింది. ఈ తెల్లవారుజామున 6 గంటల సమయంలో భూకంపం సంభవించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే సమాచారం ప్రకారం, భూకంప కేంద్రం జపాన్ ఈస్ట్ కోస్ట్ లో ఉన్న హోన్షు ఐలాండ్ లో 38.9 కిలోమీటర్ల లోతున ఉంది. భూకంపం వల్ల ఏమేరకు నష్టం వాటిల్లిందన్న వివరాలు తెలియరాలేదు.