: రేపే తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్... అధికార పార్టీలదే హవా!
తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగనుంది. రెండు రాష్ట్రాల శాసనమండలుల్లో ఖాళీగా ఉన్న తొమ్మిది స్థానాలకు ఎన్నికల సంఘం రేపు నోటిఫికేషన్ జారీ చేయనుంది. తెలంగాణలో ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, ఏపీలో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో ఎన్నికలు జరగనున్న ఐదు స్థానాల్లో నాలుగింటిని అధికార పార్టీ టీఆర్ఎస్ కైవసం చేసుకోనుంది. ఇక మిగిలిన ఒక్క స్థానాన్ని కాంగ్రెస్ హస్తగతం చేసుకునే అవకాశాలున్నాయి. ఏపీ విషయానికొస్తే ఎన్నికలు జరగనున్న నాలుగింటిలో మూడు అధికార టీడీపీ ఖాతాలో పడనుండగా, ఒక స్థానం వైసీపీకి దక్కనుంది. శాసనసభ్యుల కోటాలో జరగనున్న ఈ ఎన్నికలు దాదాపుగా ఏకగ్రీవమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.