: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆగ్రహం... కార్మిక సంఘాలకు షోకాజ్ నోటీసులు
రహదారి రవాణా సంస్థ కార్మికులు చేస్తున్న సమ్మెపై ఉమ్మడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సమ్మె విరమణపై ఈరోజు నిర్ణయం చెప్పాలని కోర్టు ఆదేశించగా, చర్చలు జరుగుతున్న సమయంలో సమ్మె విరమించలేమని ఆర్టీసీ కార్మికులు తెలిపారు. దాంతో జస్టీస్ కేసీ భాను, జస్టీస్ ఎంఎస్ కే జైస్వాల్ ల నేతృత్వంలోని ధర్మాసనం కార్మిక సంఘాలకు కోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అంతేగాక కోర్టు ధిక్కారం కింద కేసు ఎందుకు నమోదు చేయకూడదని న్యాయస్థానం ప్రశ్నించింది. క్రమశిక్షణా చర్యలకు తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యానికి ఆదేశించింది. కోర్టు ధిక్కారానికి పాల్పడిన వారిని జైలుకు పంపుతామని హెచ్చరించింది. తదుపరి విచారణను కోర్టు వేసవి సెలవులు ముగిసే వరకూ వాయిదా వేసింది.