: మియాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్ లోని మియాపూర్ వద్ద ముంబై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అమితమైన వేగంతో వెళుతున్న ఓ కారు టైరు పేలిపోవడంతో, అది అదుపుతప్పింది. ఈ క్రమంలో, జనాల మీద నుంచి వెళుతూ పక్కన ఉన్న ఓ హోటల్ గోడను ఢీకొంది. ఈ దారుణ ఘటనలో రోడ్డు పక్కన వెళుతున్న తల్లి, కుమారుడు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.