: ‘చెన్నై’ చీర్ గాళ్స్ గదులపై రాయ్ పూర్ పోలీసుల దాడులు


ఐపీఎల్ ను స్పాట్ ఫిక్సింగ్ భూతం ఇంకా వదలనట్టుంది. ఐపీఎల్-6 సీజన్ లో కలకలం రేపిన ఫిక్సింగ్ భూతం ప్రస్తుత సీజన్ ను తాకలేదనే చెప్పాలి. అయితే ఆ భూతం ప్రమాదం పొంచి ఉందన్న అనుమానాలు మాత్రం నిత్యం ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన జట్ల యాజమాన్యాలు, ఎప్పటికప్పుడు తమ వ్యూహాలను మార్చేస్తున్నాయి. చీర్ గాళ్స్ ద్వారా ఆటగాళ్లకు బుకీలు వల వేసే ప్రమాదముందన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయా జట్టు ఆటగాళ్లు, చీర్ గాళ్స్ కు వేర్వేరు హోటళ్లను బుక్ చేసుకుంటున్నాయి. అయితే నిన్న రాత్రి రాయ్ పూర్ లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య మ్యాచ్ ముగిసిన మరుక్షణమే కలకలం రేగింది. మూడు వాహనాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు నగరంలోని చెన్నై చీర్ గాళ్స్ ఉన్న హోటల్ పై దాడులు చేశారు. చీర్ గాళ్స్ ఉంటున్న గదులను క్షుణ్ణంగా పరిశీలించిన రాయ్ పూర్ పోలీసులు గాళ్స్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఎలాంటి నోటీసులు లేకుండా గదుల్లోకి దూరి ఈ తనిఖీలేంటని చీర్ గాళ్స్ ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News