: ఎర్రచందనం దొరికింది... స్మగ్లర్లు పరారయ్యారు
కడప జిల్లా సిద్దవటం మండలం భాకరాపేట వద్ద రూ.3 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదయం నిర్వహించిన తనిఖీల్లో ఎర్రచందనం తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈలోగా పోలీసులను గమనించిన స్మగ్లర్లు లారీని వదిలేసి పరారయ్యారు. శేషాచలం ఎన్ కౌంటర్ లో 20 మంది వరకు మరణించినా, ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ స్మగ్లింగ్ కొంతైనా కట్టడికాకపోవడం గమనార్హం.