: కూలిపోయిన భవనానికి భారీ భద్రత... కిలోల కొద్దీ బంగారం భూస్థాపితమైనందునే!


ముంబైలోని కల్బాదేవీ సమీపంలో గత శనివారం ఓ నాలుగంతస్తుల భారీ భవంతి అగ్నిప్రమాదంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇప్పుడా భవంతి మట్టికుప్పగా కనిపిస్తుండగా, అక్కడ భారీఎత్తున పోలీసులు మోహరించారు. ఆ భవనంలో పలువురు బంగారు ఆభరణాల తయారీదారులు ఉండడమే ఇందుకు కారణం. అగ్ని ప్రమాదం జరిగిన తరువాత ఆభరణాలు తయారుచేసే కూలీలు బయటకు పరుగులు పెట్టగా, కిలోల కొద్దీ బంగారం, ఆభరణాలు భూస్థాపితమయ్యాయని ఫిర్యాదులు వచ్చాయని, అందువల్ల 23 మంది పోలీసులతో పహారాను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. చుట్టూ సీసీటీవీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశామని వివరించారు. కనీసం 20 కిలోల బంగారం శిథిలాల క్రింద ఉండవచ్చని అంచనా. భవన శిథిలాలను తొలగించిన తరువాత సామాన్లు, విలువైన వస్తువులు, బంగారం, ఆభరణాలు తదితరాలను వెతికి తీసుకోవచ్చని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News