: నేపాల్ లో మాయమైన అమెరికన్ చాపర్, సిబ్బంది
నేపాల్ లో సహాయక చర్యల నిమిత్తం వచ్చిన అమెరికన్ హెలికాప్టర్ ఒకటి అదృశ్యమైంది. ఈ విషయాన్ని పెంటగాన్ అధికార ప్రతినిధి స్టీవ్ వార్నీ ఈ ఉదయం వెల్లడించారు. చాపర్ ప్రయాణిస్తున్న సమయంలో ఆరుగురు అమెరికన్ మెరైన్ సిబ్బంది, ఇద్దరు నేపాలీ సైనికులు ఉన్నారని, వీరందరి జాడా తెలియడం లేదని తెలిపారు. మారుమూల ప్రాంతాలకు ఆహారాన్ని తీసుకువెళ్తున్న ఈ విమానం బయలుదేరే సమయంలో ఇంధనం తక్కువగా ఉందని వెల్లడించిన ఆయన, బయలుదేరిన కొన్ని నిమిషాలకే చాపర్ ఆచూకీ తెలియరాలేదని, దానికోసం గాలింపు చర్యలు చేపట్టామని వివరించారు.